*🌍SAA* *పాఠశాల అసెంబ్లీ కోసం* *20-11-2018* *నేటి వార్తల ముఖ్యాంశాలు* @ *ఉద్యమించిన మహిళలు.. వెనక్కి తగ్గిన సీఎం: ఒడిశాలో అడవుల నరికివేతను మహిళలు వ్యతిరేకించడంతో సీఎం నవీన్ పట్నాయక్ భారీ ప్రాజెక్టును రద్దు చేశారు. దేన్‌కనల్ జిల్లాలోని బలరాంపూర్ మహిళలు ఈ ఉద్యమం చేశారు.* @ *2,960 నామినేషన్లు అందాయి: రజత్‌కుమార్ : రాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. ఈ సంఖ్య ఇంకా పెరగనుందన్నారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు* @ *ఇంటి వద్దకే బ్యాంకు: ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తపాలశాఖ కార్యకలాపాలను వేగవంతం చేసింది. డెలివరీ సిబ్బంది ద్వారా ఖాతాదారులకు ఇంటి వద్దే నగదు అందజేయడం, డిపాజిట్లు సేకరించడం వంటి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించింది.* @ *అపెక్ సభ్య దేశాల్లో చీలిక: అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలపై అమెరికా చైనా దేశాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల వల్ల పపువా న్యుగినియా వేదికగా జరిగిన ఆసియా పసిఫిక్ సహకార సదస్సులో ఏపీఈసీ సభ్య దేశాలు రెండుగా విడిపోయాయి....