*🌍SAA*
*పాఠశాల అసెంబ్లీ కోసం*
*20-11-2018*
*నేటి వార్తల ముఖ్యాంశాలు*
@ *ఉద్యమించిన మహిళలు.. వెనక్కి తగ్గిన సీఎం: ఒడిశాలో అడవుల నరికివేతను మహిళలు వ్యతిరేకించడంతో సీఎం నవీన్ పట్నాయక్ భారీ ప్రాజెక్టును రద్దు చేశారు. దేన్‌కనల్ జిల్లాలోని బలరాంపూర్ మహిళలు ఈ ఉద్యమం చేశారు.*
@ *2,960 నామినేషన్లు అందాయి: రజత్‌కుమార్ : రాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. ఈ సంఖ్య ఇంకా పెరగనుందన్నారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు*
@ *ఇంటి వద్దకే బ్యాంకు: ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తపాలశాఖ కార్యకలాపాలను వేగవంతం చేసింది. డెలివరీ సిబ్బంది ద్వారా ఖాతాదారులకు ఇంటి వద్దే నగదు అందజేయడం, డిపాజిట్లు సేకరించడం వంటి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించింది.*
@ *అపెక్ సభ్య దేశాల్లో చీలిక: అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలపై అమెరికా చైనా దేశాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల వల్ల పపువా న్యుగినియా వేదికగా జరిగిన ఆసియా పసిఫిక్ సహకార సదస్సులో ఏపీఈసీ సభ్య దేశాలు రెండుగా విడిపోయాయి.*
@ *ఉమ్మడి ప్రణాళికతో విజయం సాధ్యం..వైమానిక దళాధిపతి బీఎస్ ధనోవా: భవిష్యత్తులో ఇతర దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తే త్రివిధ దళాలతో కూడిన ఉమ్మడి ప్రణాళిక ద్వారా తక్కువ కాలంలోనే విజయం సాధించవచ్చని వైమానిక దళాధిపతి బీఎస్ ధనోవా సూచించారు.*
@ *దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం: దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా ఉంది. దీని ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. మరో రెండురోజుల్లో తుఫాన్‌గా మారే అవకాశముందని అన్నారు.*
*సుభాషిత వాక్కు*
*"గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు. ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతంకాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు."*
*"Success is not final. Failure is not fatal: It is the courage to continue that counts"*
*మంచి పద్యం*
*సుధలుగురియురా వసుధయందు వనమున్న*
*నరకబోకు మనకు నరకమగును*
*జీవనమ్మునిచ్చి జీవంబు నిలబెట్టు*
*వినుర వినయశీల వెలుగుబాల !*
*నేటి జీ. కె*
🔹 *ప్రాచీన రచయితలు - వారి రచనలు*
1) *భారవి - కిరాతార్జునీయం*
2) *బిల్హణుడు - విక్రమాంక దేవ చరిత్ర*
3) *జయదేవుడు - గీతగోవిందం*
4) *గుణాడ్యుడు - బృహత్కధ*
Comments
Post a Comment